మోదీకి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

కృష్ణా: ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం లభించింది. ఆయనకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వాగతం పలికారు. అనంతరం మోదీ హెలికాప్టర్‌లో వెలగపూడి బయలుదేరి వెళ్లారు.