ఏలూరు జిల్లాలో ధరల నియంత్రణ చేపట్టండి: JC

ఏలూరు జిల్లాలో ధరల నియంత్రణ కొరకు కార్యాచరణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ త్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఏలూరులో జేసీ అధ్యక్షతన ధరల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. జేసీ మాట్లాడుతూ.. నిత్యవసరవస్తువులు, కూరగాయల ధరలు నియంత్రణ ప్రణాళిక రూపొందించాలన్నారు. హోల్ సేల్, రిటైల్ రంగంలో ధరలను విశ్లేషించాల్సి ఉందని ధాత్రిరెడ్డి అన్నారు.