శ్రీశైలంలో ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి ప్రత్యేక పూజలు
PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమలో కుటుంబ సభ్యులు, అనుచరులు పాల్గొన్నారు.