రేషన్ షాపుల తనిఖీ.. డీలర్‌పై కేసు నమోదు
BPT: కర్లపాలెం పంచాయతీ పరిధిలోని 12వ నెంబర్ చౌక ధరల దుకాణంలో బుధవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ (CSDT) ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. షాపు నిర్వహణలో, సరుకుల నిల్వల్లో అవకతవకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలడంతో డీలర్‌పై కేసు నమోదు చేశారు.