VIDEO: గోరంట్లలో శ్రీలక్ష్మీ మాధవస్వామి గట్టు పండగ

KRNL: కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలో శ్రావణమాసం నాల్గవ శనివారం రాత్రి శ్రీలక్ష్మీ మాధవస్వామి గట్టు పండగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఎర్రవంకలోని శ్రీఆంజనేయ స్వామికి పూజలు చేసి, గట్టుపై మాధవుని పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని, వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ ప్రజలు ఐక్యంగా ఈ పండగను జరుపుకున్నారు.