'స్థానిక సంస్థ ఎన్నికలకు YCP నేతలు సిద్ధం కావాలి'

KDP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని PR, RD ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. అతి త్వరలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే వైసీపీ శ్రేణులు కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ రాష్ట్రవ్యాప్తంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వైసీపీ బలంగా ఉందన్నారు.