వైసీపీ రాజకీయాలు తగవు
VSP: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని రాజకీయ వేదికగా మార్చడం తగదని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు స్పష్టం చేశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఆయన మాట్లాడారు. నిబంధనలు తెలియకుండానే వైసీపీ సీనియర్ నేతలు కావాలనే గీతం కళాశాల భూముల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని వారు మండిపడ్డారు.