కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సస్పెండ్

KNR: కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పురమళ్ల శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.