కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్
TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. 'కాంగ్రెస్ అభ్యర్ధి నవీవ్ యాదవ్ కుటుంబం BRSలో ఉంటే మంచోళ్లు, కాంగ్రెస్‌లో ఉంటే చెడ్డ వాళ్లా? మాది రెండేళ్ల బాకీ కార్డు అయితే మీది పదేళ్ల బాకీ కార్డు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అప్పు 60 వేల కోట్లు. KCR సీఎం అయిన తర్వాత పదేళ్లలో 8 లక్షల కోట్లకు తీసుకెళ్లారు' అని మండిపడ్డారు.