CMతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అల్పాహార విందు
అన్నమయ్య: అమరావతి సచివాలయంలో జరుగుతున్న ఆరు జిల్లాల కలెక్టర్ల సదస్సులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు గురువారం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యమంత్రిని కలిసి జిల్లాలో జరుగుతున్న ప్రగతి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలో అమలు అవుతున్న ప్రభుత్వ పథకాలు ముఖ్యమంత్రికి వివరించారు.