బాలికలకు HPV టీకా.. క్యాన్సర్కు చెక్
SRD: మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 14–15 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్న వయసులోనే ఈ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చని గుమ్మడిదల డాక్టర్ మధుకర్ తెలిపారు.