చెన్నూరు ఇటుక బట్టీలపై అధికారుల కొరడా

చెన్నూరు ఇటుక బట్టీలపై అధికారుల కొరడా

KDP: చెన్నూరు క్రాసింగ్ వద్ద ఇటుక బట్టీల పొగ, బూడిదతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, కంటి వ్యాధుల ముప్పు ఉందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు, హైవేకి 500 మీటర్ల దూరంలో బట్టీలు ఏర్పాటు చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీవో కిరణ్ మోహన్‌రావు, తదితరులు యజమానులకు నోటీసులు జారీ చేశారు