వ్యవసాయ రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో చర్యలు
PLD: నాదెండ్ల మండలంలో కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన “రైతన్నా… మీకోసం” కార్యక్రమాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రామంలోని రైతుల ఇళ్లను సందర్శించి ప్రభుత్వం అమలుచేయబోయే నూతన సాగు విధానాలు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు రైతులకు వివరించారు.అనంతరం రైతులకు తైవాన్ స్ప్రేయర్లు పంపిణీ చేశారు.