VIDEO: కరెంట్ షాక్‌తో రైతు మృతి.. ఉద్రిక్తత
WGL: గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బండారు కొమురయ్య పొలానికి వెళ్లిన గాద శ్రీను కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తన పొలంలో పందులను అడ్డుకునేందుకు కొమురయ్య కరెంట్ తీగలు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఆగ్రహించిన శ్రీను కుటుంబ సభ్యులు మృతదేహంతో కొమురయ్య ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఏనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు.