ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 15,16వ తేదీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. బీఏ TM/EM, ఉర్దూ మీడియంలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే బీకాం TM/EM మీడియంలో సీట్లు ఉన్నట్లు తెలియజేశారు. ప్రవేశం పొందే విద్యార్థులు ఒక సెట్ జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.