జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్

KDP: జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బుధవారం పోలీసులు ఎర్రగుంట్లలో అరెస్టు చేశారు. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు సమయంలో తమ పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచారు.