'పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి'
VZM: ఈనెల 24న జరగనున్న ఏపీఆర్‌జేసీ & డీసీ సెట్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో సిహెచ్ సత్తిబాబు అధికారులను ఆదేశించారు. ప్రవేశపరీక్ష నిర్వహణపై తమ ఛాంబర్‌లో మంగళవారం వివిధ శాఖల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, పరీక్షలకు 3,361మంది విద్యార్థులు హాజరావుతారని పేర్కొన్నారు.