VIDEO: అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
GDWL: సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా నీలహల్లి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, ఇతర వసతి ఏర్పాట్లు చేశారు. అక్కడ శ్రీరామ నామ స్మరణతో భక్తి పారవశ్యం నెలకొంది. కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.