"పెన్సిల్ మొనపై వెలిగిన దీపం"

"పెన్సిల్ మొనపై వెలిగిన దీపం"

WGL: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీ రామోజు జయకుమార్ కార్తీక పౌర్ణమి సందర్భంగా పెన్సిల్ లెడ్ మొనపై సూక్ష్మ దీప ప్రమిద చెక్కారు. అందులో నూనె వత్తి ఉంచి వెలిగించి, తన అపూర్వ ప్రతిభను మరోసారి చాటారు. ఈ చిన్న దీపం గంటల తరబడి మెరిసింది. దీంతో పలువురు నాయకులు, జిల్లా ప్రజలు జయకుమార్‌ను అభినందించారు.