స్కూటీని ఢీకొట్టిన బొలెరో.. పలువురికి గాయాలు
కోనసీమ: ముమ్మిడివరం మండలం అన్నంపల్లి జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బొలెరో వాహనం స్కూటీని బలంగా ఢీ కొట్టి పంట బోదెలోకి దూసుకెళ్లింది. స్కూటీపై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.