'తుఫాన్ కారణంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'
MBNR: తుఫాన్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో 08542-241165 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె వెల్లడించారు.