VIDEO: పత్తికి నిప్పు పెట్టిన దుండగులు
RR: పత్తికి నిప్పు పెట్టిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దఎల్కిచర్ల గ్రామంలో ఇద్దరు పత్తి కౌలు రైతులకు సంబంధించిన 60 క్వింటాళ్ల పత్తిని ఇంట్లో నిలువ చేశారు. ఈ క్రమంలో అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండగులు పత్తికి నిప్పంటించారు. దీంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.