అక్షరాస్యతా దినోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజి మంగళవారం వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 59వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా గోడపత్రికను ఆవిష్కరించారు. అక్షరాస్యత ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమని, అందరూ చదువుకున్నప్పుడే నిజమైన పురోగతి ఉంటుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.