'ఆడశిశువుల విక్రయాలు, బాల్య వివాహాలను అరికట్టాలి'

'ఆడశిశువుల విక్రయాలు, బాల్య వివాహాలను అరికట్టాలి'

NLG: ఆడ శిశువుల అక్రమ విక్రయాలు, బాల్య వివాహాలు, బాలికలపై అత్యాచారాల వంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గ్రామస్థాయిలో విలేజ్ చైల్డ్ ప్రొడక్షన్ కమిటీలను బలోపేతం చేసే విషయంపై బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.