విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
కోనసీమ: గ్రామాలలో విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఆయన సఖినేటిపల్లి మండలంలోని అప్పన రాముని లంకలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.