'నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
KNR: సంతాన సాఫల్య కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ తెలిపారు. నిన్న కరీంనగర్‌లోని మూడు సంతాన సాఫల్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు వెల్లడించారు. యంత్రాల పనితీరును పరిశీలించినట్లు పేర్కొన్నారు.