ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీపై విస్తృత అవగాహన
WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వనపర్తి అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ చిన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.