యాదవులకు అన్యాయం చేసింది టీడీపీనే: మాజీ మంత్రి

యాదవులకు అన్యాయం చేసింది టీడీపీనే: మాజీ మంత్రి

W.G: రాష్ట్రంలో యాదవులకు అన్యాయం చేసింది టీడీపీనేనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. ఇవాళ తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి యాదవులను కించపరిచినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. యాదవులకు ప్రాధాన్యత కల్పించింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.