మొర్రిగుడలో రచ్చబండ ప్రారంభోత్సవం

ASR: డుంబ్రిగుడ మండలం గసభ గ్రామ పంచాయతీ మొర్రిగుడ గ్రామంలో నిర్మించిన రచ్చబండను స్థానిక సర్పంచ్ పాంగి సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2 లక్షలతో నిర్మాణం చేశామని చెప్పారు. ఈ ప్రజావేధిక ప్రజాసమస్యల పరిష్కారానికి, గ్రామ సమస్యలు చర్చించుటకు ఉపయోగించాలనీ కోరారు.