ఖమ్మం మార్కెట్‌కు నేడు, రేపు సెలవు

ఖమ్మం మార్కెట్‌కు నేడు, రేపు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.