VIDEO: తాగునీటి కోసం ప్రజల ఇబ్బందులు
MHBD: కురవి మండలం గుండ్రాతి మడుగులోని 8వ వార్డులో ప్రజలు గత మూడు రోజులుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా.. స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.