నిరుద్యోగులకు అలర్ట్.. గడువు పొడిగింపు..!
PLD: RRB గ్రూప్-డి 2026 పరీక్షలకు సిద్ధమయ్యే ఉమ్మడి జిల్లా BC, ST, SC అభ్యర్థులకు ఉచిత శిక్షణ పొందే గడువు ఈనెల 8 వరకు పొడిగించారు. ఆసక్తి గల వారు గుంటూరులోని రాజా గారితోటలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని ఇంఛార్జ్ సంచాలకురాలు కె. మయూరి తెలిపారు. పూర్తి వివరాలకు 0863-2358071 నంబర్‌ను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.