చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

KNR: వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన బావు వేదశ్విని(18) కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూసింది. వేదశ్విని అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.