సంజీవయ్య సేవలు చిరస్మరణీయం: జేసీ

సంజీవయ్య సేవలు చిరస్మరణీయం: జేసీ

KRNL: ఉమ్మడి ఏపీ తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా శనివారం కర్నూలులో ఆయన విగ్రహానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సంజీవయ్య సేవలను స్మరించి, సామాజిక న్యాయం సాధనలో ఆయన చేసిన కృషిని జేసీ కొనియాడారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాధిక, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.