VIDEO: 'భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయం'

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యా రెడ్డి HIT TVతో మాట్లాడారు. నవీన్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలు సొంతవాడిగా భావించారన్నారు. మరోవైపు మాగంటి సునీతకు నియోజకవర్గంపై సరైన అవగాహన లేదన్నారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.