లారీ ఢీకొని బైకర్‌కు గాయాలు
NDL: మహానంది మండలం నంద్యాల-గిద్దలూరు జాతీయ రహదారిలో బోయలకుంట్ల ఆర్చి వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాలకు వెళ్తున్న వెంకటసుబ్బయ్య బైకును గిద్దలూరు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని గాజుల పల్లె ఆసుపత్రికి తరలించారు.