తిరుమల వాడపల్లికి క్యూ కట్టిన భక్తులు
కోనసీమ: మాఘ పౌర్ణమి, ఆదివారం సెలవు దినం కావడంతో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆత్రేయపురం మండలంలోని ఈ పుణ్యక్షేత్రానికి ఉభయ గోదావరి జిల్లాల నుండే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు.