భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై 7న ధర్నా
ASR: నర్సీపట్నంలో భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆదివారం జరిగింది. సంఘం నాయకులు అడిగర్ల రాజు కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ నిధి ద్వారా ప్రమాద బీమా, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఏప్రిల్ 7న ధర్నా చేపడతామని తెలిపారు.