యర్రగొండపాలెంలో గుప్తనిధుల కలకలం

యర్రగొండపాలెంలో గుప్తనిధుల కలకలం

ప్రకాశం: యర్రగొండపాలెం సమీపంలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. వీరయ్య స్వామి విగ్రహం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గురువారం జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. వారిపై అటవీశాఖ అధికారులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి జేసీబీ, జీపును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.