VIDEO: నరసరావుపేటలో డీజిల్ దొంగల ముఠా పట్టివేత

PLD: నరసరావుపేటలోని జగన్నాథ్ పెట్రోల్ బంక్‌లో లారీల నుంచి డీజిల్ దొంగిలిస్తున్న నలుగురు యువకులను సిబ్బంది పట్టుకున్నారు. సిబ్బంది కేకలు వేయడంతో ఇద్దరు దొంగలు పారిపోగా, మిగిలిన ఇద్దరిని వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు దొంగలు నరసరావుపేట 2-టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.