పాము కాటుతో యువతి మృతి
PLD: పిడుగురాళ్లలో ఓ యువతి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆమె బంధువులు సోమవారం ఆరోపించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆ యువతిని పాముకాటుకు చికిత్స కోసం అదే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యులు సరైన చికిత్స అందించకపోవడం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి నిరసన తెలిపారు.