గ్రామ పంచాయతీ వర్కర్ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ వర్కర్ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

NLG: చందంపేట మండలం పొలేపల్లి గ్రామ పంచాయతీ వర్కర్ నాగిళ్ళ జంగయ్య మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం పొలేపల్లి గ్రామంలో జంగయ్య మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు. జంగయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.