ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: జేసీ

ప్రకాశం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాలలో ప్రక్రియ మందకొడిగా ఉందనీ, ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సూచించారు.