మాజీ ఎమ్మెల్యే ఓ పెద్ద మోసగాడు: వినయ్ రెడ్డి
NZB: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ పెద్ద మోసగాడని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ రెడ్డి విమర్శించారు. ఆర్మూర్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. గతంలో అక్రమంగా ఇచ్చిన 147 ఇంటి నెంబర్లను తాము వచ్చాక రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు.