VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఆశ్రమంలో అగ్నిప్రమాదం
KDP: పొద్దుటూరులోని స్థానిక గీతాశ్రమం వీధిలో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆశ్రమానికి చెందిన ఇంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పక్కనున్న హోటలుకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. చెక్క దంతెలతో నిర్మించిన ఇల్లు, అందులోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ ఆఫీసర్ బసివిరెడ్డి తెలిపారు.