బతుకమ్మ కుంట పనులను పరిశీలించిన కలెక్టర్

JN: పట్టణానికి స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండే బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ తెలిపారు. శుక్రవారం పట్టణంలో గల బతుకమ్మ కుంటను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి, తుది దశకి చేరుకున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.