'యాదవులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలి'

'యాదవులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలి'

SRCL: యాదవులు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని యాదవ సంఘం మహాసభ ఉమ్మడి జిల్లా కన్వీనర్ సాగని కొమురయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాదవులను ఏకం చేయడం కోసం సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన యాదవ సంఘం సమావేశంలో యాదవులు ఆదివారం రోజున మాంసం, మద్యం తీసుకోకూడదని ఏకగ్రీవ తీర్మానం చేసామన్నారు.