బాలికను మోసం చేసి పారిపోయిన నిందితుడు అరెస్ట్

గుంటురూ: బాలికను మోసం చేసి ఉడాయించి పారిపోయిన నిందితుడిని తెనాలి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెనాలి డీఏస్పీ రమేష్ మాట్లాడుతూ.. తెనాలిలోని ఓ ప్రైవేటు స్టాల్లో పని చేస్తున్న అమ్మాయిని గుజరాత్‌కు చెందిన జగదీశ్ ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భవతిని చేసి పారిపోయాడని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, గుజరాత్‌లో ఉన్నఅతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.