VIDEO: పెద్దకడబూరులో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ

KRNL: వాల్మీకి మహర్షి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో వాల్మీకి సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్మీకి విగ్రహావిష్కరణ వైభవంగా జరిగింది. ఇందులో టీడీపీ నేతలు రమాకాంతరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాకేష్ రెడ్డి, ముక్కన్న ఉన్నారు.