ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలం

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. కెరటాల తాకిడికి సుబ్బంపేట వద్ద బీచ్ రోడ్డు ధ్వంసమైంది. అలాగే, ప్రాథమిక పాఠశాల వద్దకు సముద్రపు నీరు చేరింది. సముద్రపు పోటు వల్ల కెరటాలు భీకరంగా ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.